అన్నమయ్య భక్తి(శృంగార) మాధురి- 17-10-2015
06. చాలు చాలు నీ జాజర నన్ను |
వేంకటేశునితో ఆత్మీయత పెంచుకొనే మధుర భక్తి అనే రహదారిలో అన్నమయ్య ఒక నాయికగా మారిపోయాడు.
ఆయనతో మాటలతో ఆడుకొన్నాడు.పాడుకొన్నాడు.చివరలో ఆయనలో తాను కరగిపోతున్నానని మురిసిపోయాడు.దేవునితో
ఆత్మీయంగా మసలగలిగితే ఆయనలో కరగటం ఎంత సులువో నిరూపించాడు.
****
బాబూ ! తిరుపతి సామీ ! ఇక నీ జాజర చాలు.
జాజర అంటే ఏమిటో తెలియనట్టు అడుగుతావా!
జాజర అంటే మోసం...వంచన.
నీకు అలవాటయింది అదే కదా స్వామీ !
నీ జాజర నన్ను బాగా దుఃఖ పెట్టింది. బాధ పెట్టింది. ఇక చాల్లే.
01. ప్రేమ బాధలతో వాడిపోతున్నాను.ఇదివరకు ఎంత కాంతిగా ఉండేదాన్నో !
తమరు చేసే తలనొప్పు పనులతో వణికిపోతున్నాను.
ముందు ముందు ఇంకా ఎలాంటి వేషాలు వేస్తావో అని భయపడిపోతున్నాను.
నా ఖర్మ... నామటుకు నేను అంటూనే ఉంటాను . దొంగ వేషాలు వేసి నన్ను కౌగిలించుకొని పారిపోతావు. ఆతరువాత ఆగమన్నాఈ పులకలు ఆగి చావవు. నీకు దూరమై ఈ పులకల శరీరంతో పక్క మీద అటూ ఇటూ దొర్లుతున్నాను.
సరిగ్గా.. ఇప్పుడే సమయం కుదిరిందా నీకు.. అతిశయించిన ,ఉత్సాహంతో జాజర –రంగుల ఉత్సవం - చల్లుతావేమిటి !?
02. నీ తప్పులను క్షమించి నీ పక్కకు వచ్చినా నన్ను ఒల్లవు. ఇష్టపడవు. అలాంటి నిన్ను చూసి ఉడికిపోతున్నాను. ఏమనుకొన్నావో !
కనబడకుండా ఎన్ని చిన్ని చిన్ని పనులు చేస్తావో నా తండ్రీ ! నీ చిల్లర చేతలు ఎవరికీ చెప్పుకోలేక సిగ్గుతో చితికిపోతున్నా.
గంధపు పొడి చల్లుతావేమిటి ? ! అది నీ అబద్ధాల సుగంధం కలిసిన గంధపుపొడి.. అది మీద పడుతుంటే చల్లదనం కాదు. ఒళ్లు మండిపోతోంది.
ఆ గంధపు పొడి మీద చల్లకు .
03.ఓ వేంకటాచలపతీ ! ఇదుగో! ఈ రోజు నీ కౌగిలిలో చెమటలు మిలమిలా శరీరం మీద మెరిసిపోతుండగా కరిగిపోయాను.
ఆలోచించి, ప్రయత్నపూర్వకముగా, త్వరపడి , నేను నీ కౌగిలిని దొరికించుకొన్నాను. ఇందాకటినుంచి ఏదో అన్నాను కాని – ఏమనుకోకు ! నీ రంగులు చల్లే ఉత్తుత్తి మోసాల కార్య క్రమం బాగానే ఉంది.
****
పల్లవి
చాలు చాలు నీ జాజర నన్ను
జాలి బరచె నీ జాజర ||
01.వలపు వేదనల వాడెను యీ- |
తలనొప్పుల చే దలకేను |
పులకల మేనితో బొరలేను కడు |
జలిగొని చల్లకు జాజర ||
02.ఒల్లని నినుగని వుడికేను నీ- |
చిల్లర చేతల జిమిడేను |
కల్లగందవొడి గా గేనుపై |
జల్లకు చల్లకు జాజర ||
03.తివిరి వేంకటాధిప నేను నీ- |
కవుగిట కబ్బితిగడు నేను |
రవరవ చమట గరగినేడు యిదె |
చవులాయను నీ జాజర || (05-332 రేకు 87)
(పి సుశీల గాన సౌజన్యం )